ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది. ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను 4 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ గెలిచిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఒక అసాధారణ ఆట… ఒక అసాధారణ ఫలితం అంటూ టీమిండియా గెలుపును కీర్తించారు.
“ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకువస్తున్న మన క్రికెట్ టీమ్ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడారు. అమోఘమైన ఆల్ రౌండ్ షోతో అలరించిన మన జట్టుకు శుభాభినందనలు” అంటూ మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఛాంపియన్స్ గా గెలిచిన భారత్ కు విషెస్ మొదలయాయ్యి. ఇండియా మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. బాణాసంచా కాల్చుతూ, జైహో అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.