అది దా సర్ ప్రైజ్ సాంగ్ పై కామెంట్స్!

అది దా సర్ ప్రైజ్ సాంగ్ పై కామెంట్స్!

కేతిక శర్మ చేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఇవేం స్టెప్పులు, ఒక టాప్ కొరియోగ్రాఫర్ ఇలా చేయించడం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ సినిమా కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది. రీసెంటుగా ఈ సినిమా నుంచి అది దా సర్ ప్రైజ్ సాంగ్ ను వదిలారు. జీవీ ప్రకాశ్ కుమార్ బాణీ కట్టిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీని అందించాడు. ఈ తరహా పాటలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే కంపోజ్ చేస్తూ ఉంటారు. అందువలన అటు సాహిత్యం..ఇటు మూమెంట్స్ కాస్త హాట్ హాట్ గానే అనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పాట విషయంలో కేతిక వేసిన ఒక ‘హుక్ స్టెప్’ మరీ అభ్యంతరకరంగా ఉందనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.

తన స్కర్టును తనే ముందుకు లాగుతూ కేతిక వేసిన ఈ హుక్ స్టెప్ చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. శేఖర్ మాస్టర్ కాస్త మోతాదు తగ్గించాలనే కామెంట్లు పెడుతున్నారు. ఈ స్టెప్స్ చేయడానికి కేతిక ఎలా ఒప్పుకుందని, అవకాశాలు రాకపోతే ఇలా చేసేస్తారా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు