2018లో సంచలనం సృష్టించిన అమృత – ప్రణయ్ గుర్తున్నారా? అమృత – ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమృత 5 నెలల గర్భవతి. ఇలా మొత్తం సంతోషంగా ఉన్నప్పుడు పరువు హత్య సంచలనం సృష్టించింది. భార్య అమృతను ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా దుండగులు ప్రణయ్‌పై దాడి చేసి చంపేశారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను మారుతీ రావు దారుణంగా హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి, అమృత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ప్రణయ్ హత్యకేసులో ఏ1గా ఉన్న మారుతీ రావు 2020లో హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు.
తాజగా కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో A2 నిందితుడిగా ఉనన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేశారు. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు ఉండగా.. 2020లో అతడు సూసైడ్ చేసుకున్నాడు. A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్‌అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌శర్మకు బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అస్గల్ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మిగిలిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది.