ఏపీలో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండలు, వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2025లో శివరాత్రి రాకముందే సూర్యుడు వచ్చేసాడు. కొన్ని జిల్లాల్లో ఏప్రిల్ కూడా రాకముందే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండలు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చర్చించుకుంటున్నారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిదని.. వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఎండాకాలం కాబట్టి తగినంత నీరు తాగుతుండాలని.. చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచనలు చేస్తున్నారు. తేలికపాటి, కాటన్ దుస్తులను ధరించడం మంచిదని.. పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవాలి అంటున్నారు. ఒకవేళ వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని.. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు