ప్రముఖ సినీ నటి సాయిపల్లవి తన సోదరుడి పెళ్లి వేడుకలో డ్యాన్సుతో అలరించారు. నీలం రంగు చీర ధరించిన సాయిపల్లవి చిందేశారు. అయితే, ఈ పెళ్లి వేడుక ఎక్కడ జరిగిందనే వివరాలు రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సాయిపల్లవి తన కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో గతంలోనూ డ్యాన్సు చేశారు. గతంలో తన సోదరి వివాహం సమయంలో అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. మెహందీ, పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్సు చేశారు. అప్పుడు కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే తను నటించిన అమరన్, తండేల్ భారీ హిట్లు కొట్టాయి. కలెక్షన్స్ లోనూ రికార్డ్స్ సృష్టించాయి. అమరన్ లో సాయిపల్లవి అద్భుతంగా నటించిందని, ఆ పాత్రలో జీవించేసిందని అభినందనలు వచ్చాయి. ఇక నాగచైతన్య నటించిన తండేల్ 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. అక్కినేని ఫ్యామిలీకి మొదటి 100 కోట్ల సినిమా ఇదే కావడం విశేషం. ఈ రెండు విజయాలతో సాయిపల్లవి మరింత జోష్ లో ఉంది