రన్యా రావు సంచలన ఆరోపణలు ఆరోపణలు చేశారు. దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో కన్నడ నటి రన్యా రావు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెకు మూడు రోజుల డీఆర్ఐ కస్టడీ పూర్తయ్యింది. ఈ సందర్భంగా కస్టడీలో ఏమైనా వేధించారా? టార్చర్ చేశారా? అంటూ జడ్జి ప్రశ్నించారు. కొద్దిసేపు మౌనంగా ఉన్న ఆమె.. ఒక్కసారిగా బోరున ఏడ్చింది. అధికారులు తనను మాటలతో వేధించారని వాపోయింది.
‘శారీరకంగా హింసించకపోయినా.. నేను ఇలా చేయకపోయినా లేదా అలా చేయకపోయినా పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించారు. మానసికంగా ఎంతో వేదనకు గురయ్యాను’ అని ఆమె ఉద్వేగానికి గురయ్యారు. అయితే, ఆమెను ఏరకంగానూ వేధింపులకు గురిచేయలేదని దర్యాప్తు అధికారి స్పష్టం చేశారు. ‘మేం అడిగినా.. ఆమె సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా ఉండిపోతోంది.. ఆధారాలు చూపించి, ప్రశ్నించినా ఆమె నోరువిప్పడం లేదు.. వా విచారణకు ఆమె సహకరించలేదు.. మా దర్యాప్తు ప్రక్రియ మొత్తాన్ని మేం రికార్డ్ చేశాం’ అని ఆయన వివరించారు.