ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్స్ లో న్యూజిలాండ్ 251/7 స్కోర్ చేసింది. పవర్ ప్లే లో మంచి ఆరంభం వచ్చినా, కుల్దీప్ కివీస్ కు చుక్కలు చూపించాడు. వరుస ఓవర్లలో డేంజరస్ బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత భారత స్పిన్నర్లు కివీస్ ను ఇబ్బంది పెట్టారు. అయితే ఆ తరువాత డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డేంజరస్ గా మారుతున్న ఈ పార్టనర్ షిప్ ని వరుణ్ చక్రవర్తి విడతీసాడు. భారత స్పిన్నర్లు కివీస్ ను ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి చేసారు. కివీస్ బ్యాట్స్ మెన్ లో డారిల్ మిచెల్, బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. డేంజరస్ గా మారిన డారిల్ మిచెల్ ని షమీ అవుట్ చేసాడు. చివర్లో బ్రేస్‌వెల్ వేగంగా ఆడడంతో 251 పరుగులు చేసింది ఛేజింగ్ లో మొదటి 10 ఓవర్లు ఫైనల్స్ లో కీలకం కానుంది. అందరి కళ్ళు రోహిత్, కోహ్లీ పైనే ఉన్నాయి.
న్యూజిలాండ్ స్కోర్: విల్ యంగ్ – 15, రచిన్ రవీంద్ర – 37, కేన్ విలియమ్సన్ – 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ – 34, డారిల్ మిచెల్ – 63, బ్రేస్‌వెల్ – 53, మిచెల్ సాంట్నర్ – 8, నాథన్ స్మిత్ – 0