ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ అద్భుతంగా స్టార్ట్ చేసింది. రోహిత్ శర్మ ఈ ట్రోఫీలో మొదటిసారి హాఫ్ సెంచరీ చేసాడు. అద్భుతమైన సిక్సర్లతో కివీస్ కు చుక్కలు చూపించాడు. మొదటి ఓవర్ లోనే సిక్స్ తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. గిల్ నెమ్మదిగా స్ట్రైక్ రొటేట్ చేయగా, రోహిత్ శర్మ మాత్రం వేగంగా ఆడాడు. కీలక మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పేసాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. దీంతో పవర్ ప్లే లో భారత్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది.

Posted inCategories sports