posani

పోసాని కృష్ణ మురళికి బెయిల్

గత కొన్నిరోజులుగా ఏపీలో పోసాని కృష్ణ మురళి అరెస్ట్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోసాని కృష్ణమురళికి ఊరట కలిగింది. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టు బుధవారం విచారణ జరిపి తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. తిరిగి విచారణ జరిపి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, పోసానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోసాని అరెస్ట్ ఏపీ మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. ఏపీలో ఆయనపై 19 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో పోసాని ఎప్పుడు ఏ స్టేషన్ లో ఉన్నారో ఎవ్వరికి తెలియదు. పోసానిని పోలీసులు వరుసగా ఆదోని, గుంటూరు, కర్నూల్, గుంటూరు అంటూ తీసుకెళ్లారు. కొన్నిరోజుల ముందు బెయిల్ వస్తుందనుకున్నారు, కానీ చివరి నిమిషంలో పోసానికి షాక్ తగిలింది.

పోసానిపై వరుస కేసులు నమోదయ్యాయి. సినీ పరిశ్రమలో విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఫిర్యాదులు అందడంతో పోసానిపై కేసులు నమోదు చేశారు. పోసాని అరెస్ట్ కావడంతో ఎన్నికల ముందు పోసాని మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి.