ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ కి రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఛాంపియన్ ట్రోఫీలో మొదటిసారి హాఫ్ సెంచరీ చేసాడు. కీలక సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లే తరువాత కూడా రోహిత్, గిల్ అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ టైం దొరినప్పుడు బాల్ ని బౌండరీకి తరలించారు. దీంతో ఛాంపియన్ ట్రోఫీలో మొదటిసారి భారత్ ఓపెనింగ్ పెయిర్ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
అయితే ఆ తరువాత ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కి గిల్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో కివీస్ ఊపిరి పీల్చుకున్నారు. మంచి ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 76 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత శ్రేయాస్ అయ్యర్, అక్సర్ పటేల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో శ్రేయాస్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన అక్సర్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య భారీ షాట్ లు ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. చివర్లో హార్దిక్ అవుట్ అయినా కేఎల్ రాహుల్, జడేజా మ్యాచ్ ని పూర్తి చేసారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన కివీస్ పవర్ ప్లే లో అద్భుతంగా ఆడింది. అయితే కుల్దీప్ వరుస ఓవర్లలో కుల్దీప్ వరుస వికెట్ లతో కివీస్ ను దెబ్బ కొట్టాడు. గత మ్యాచ్ సెంచరీ హీరోలు రచిన్ రవీంద్ర, కీలక బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ ని పెవిలియన్ పంపించాడు. కివీస్ బ్యాట్స్ మెన్ లో డారిల్ మిచెల్, బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరి 5 ఓవర్లలో బ్రేస్‌వెల్ వేగంగా ఆడడంతో కివీస్ 250 మార్క్ ను దాటింది.