ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్.. న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. రోహిత్, శ్రేయాస్ అయ్యర్, అక్సర్ పటేల్, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కీలక సమయంలో రాణించారు. మ్యాచ్ గెలవగానే భారత్ సంబరాల్లో మునిగిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమదైన శైలిలో సంబురాలు జరుపుకున్నారు. పిచ్‌పై దూసుకొచ్చిన ఈ ప్లేయర్లు.. స్టంప్స్‌ను తీసి వాడితో దాండియా ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ తర్వాత ఫొటోలకు కూడా వీరిద్దరూ కలిసే ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రోకో ఖాతాలో మరో ఐసీసీ టైటిల్.. కంగ్రాట్స్ టీమిండియా అని కామెంట్లు చేస్తున్నారు.
జడేజా, హర్షిత్ రానా, అర్షదీప్ డాన్స్ తో అలరించారు. ఇక హార్దిక్ పాండ్య తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో ఫోటో దిగాడు. జడేజా ఫోర్ కొట్టి విజయం అందించగానే టీం మొత్తం గ్రౌండ్ లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. టీమిండియా ఛాంపియన్ గా అవతరించడంతో సర్వత్రా అభినందనల వర్షం కురుస్తోంది. ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు.