ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. రోహిత్ సేన ఫైనల్స్ లో కివీస్ పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా భారత్ సంబరాల్లో మునిగిపోయింది. టీమిండియా ఛాంపియన్ గా అవతరించడంతో సర్వత్రా అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని గెలుచుకున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ టోర్నీ మొత్తం టీమిండియా ఆటతీరు అద్వితీయం అని అభివర్ణించారు. అన్ని రంగాల్లోనూ టీమిండియా నైపుణ్యం ప్రదర్శించిందని కొనియాడారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించడం జట్టు అంకితభావానికి, ప్రతిభకు గీటురాయి అని పవన్ పేర్కొన్నారు.