
Posted inCategories sports
రిటైర్మెంట్‌పై రోహిత్ క్లారిటీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. తాను ఇప్పుడల్లా వన్డే ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకోవడం లేదని చెప్పేశాడు. తన రిటైర్మెంట్‌పై ఎలాంటి రూమర్స్, ఊహాగానాలు చేయొద్దని చెప్పాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ వన్డే ఫార్మాట్‌లో నేను ఇప్పుడల్లా రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకోవడం లేదు. ఈ రిటైర్మెంట్‌పై ఇకపై ఎవరూ ఎలాంటి రూమర్స్ పుట్టించకండి. ఇప్పటికైతే ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్ లేదు జరిగేది ఏదో జరుగుతూనే ఉంటుంది. సుదీర్ఘనైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. కానీ ఇది యువ ఆటగాళ్లపై కూడా ప్రభావం చూపుతుంది” అని ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ అన్నాడు.
దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఓటమి ఎగురకుండా ఛాంపియన్స్‌గా నిలిచింది. అంతకముందు జరిగిన T20 వరల్డ్ కప్ ను కూడా అందించాడు. అయితే ఆ తరువాత పొట్టి ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత వన్ డే ఫార్మాట్ కు కూడా గుడ్ బై చెబుతాడని రూమర్స్ వచ్చాయి. మొత్తానికి రోహిత్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చేసాడు.