రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీలో చాలా రిస్కులు తీసుకున్నాడు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు బుమ్రా దూరమయ్యాడు. అంతేకాదు పంత్ కి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ రాలేదు. నలుగురు స్పిన్నర్లతో వెళ్ళాడు. బ్యాటింగ్ పోసిషన్ లో కూడా అక్సర్ పటేల్ ను ముందుకు పంపించాడు. రాహుల్ కంటే ముందు పంపించాడు. బ్యాటింగ్ లో కూడా వేగంగానే ఆడాడు. కీలక సమయంలో వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యకి కొత్త బాల్ ఇచ్చాడు.
అయితే రోహిత్ చేసిన ప్రతి రిస్క్ భారత్ కి కలిసొచ్చింది. నెంబర్ 5 లో అక్సర్ పటేల్ ను పంపడం భారత్ కి కలిసొచ్చింది. T20 వరల్డ్ కప్ అందించిన ఉత్సాహంతో వెళ్లిన రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీలో అదే ఫార్ములా కొనసాగించాడు. ట్రోఫీలో ఫైనల్స్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ట్రోఫీలో మొదటిసారి హాఫ్ సెంచరీ నమోదు చేసాడు. బౌలింగ్ లో మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్ లో రోహిత్ తగ్గేదేలే అని జట్టును ముందుండి నడిపించాడు.
ఫైనల్స్ లో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 76 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వేగంగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్ పోగట్టుకున్నాడు. రికార్డుల కోసం కాకుండా గత కొన్ని నెలల నుంచి రోహిత్ వేగంగా ఆడడమే బలంగా మార్చుకున్నాడు. పవర్ ప్లే లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాడు.