రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీతో ఇండియా ఛాంపియన్ ట్రోఫీ అందుకుంది. ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్ గ నిలిచింది. సెమి ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై గెలిచి వరల్డ్ కప్ రివెంజ్ తీర్చుకుంది. ఇప్పుడు ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై గెలిచి మరో రివెంజ్ తీర్చుకుంది. రోహిత్ శర్మ గత 4 ICC ఈవెంట్స్ లో ఇండియాను ఫైనల్ చేర్చాడు. T20 వరల్డ్ కప్, ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీని అందించాడు. బుమ్రా లేకపోయినా అద్భుతంగా బౌలింగ్స్ లో మార్పులు చేసాడు. వరల్డ్ కప్ ఫైనల్స్, T20 వరల్డ్ కప్ ఫైనల్స్, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ లో అద్భుతంగా కెప్టెన్సీ చేసి, కరెక్ట్ టైం లో బౌలింగ్ లో మార్పులు, ఫీల్డింగ్ లో మార్పులు చేసి విజయాలు అందించాడు. వన్ డే వరల్డ్ కప్ నుంచి బ్యాటింగ్ లో వేగంగా ఆడుతూ మంచి ఆరంభాన్ని ఇచ్చి టీంలో జోష్ పెంచాడు. ఈ ట్రోఫీలో పరుగులు ఎక్కువగా చేయకపోయినా తన కెప్టెన్సీతో జట్టును ముందుంచి నడిపించాడు.
ఫైనల్స్ లో హిట్ మ్యాన్ షో: ఛాంపియన్ ట్రోఫీలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. బిగ్ మ్యాచ్ లో ఓపికతో క్రీజులో నిల్చున్నాడు. పవర్ ప్లే లో అదిరిపోయే షాట్ లతో అదరగొట్టాడు. కోహ్లీ అవుట్ అయ్యాక మరింత భాద్యత తీసుకున్నాడు. అయితే డాట్ బాల్స్ పెరుగుతుండడంతో క్రీజు దాటి ఆడేందుకు ప్రయత్నించి 76 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.