స్నానం చేస్తుండగా గుండెపోటుతో లా స్టూడెంట్ మృతి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన షాద్‌నిక్ (19) సిండయోసిస్ డీమ్డ్ వర్సిటీలో లా థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం కాలేజీకి వెళ్లేందుకు స్నానం చేస్తుండగా.. హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడు. గమనించిన కాలేజీ యాజమాన్యం శంషాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు.. అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అక్కడి నుంచి షాద్‌నిక్ డెడ్‌బాడీని ఉస్మానియా హాస్పిటల్‌కు తలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థి మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

Posted inCategories News Telangana Trending News