gold

అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఇదే!

హిందువులు, జైనులు అత్యంత పవిత్రంగా భావించే పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పర్వదినం ఏప్రిల్ 30వ తేదీ, బుధవారం నాడు రానుంది. అందుకే అక్షయ తృతీయ రోజున వివిధ జ్యువెల్లరీ కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. డిస్కౌంట్లు, మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు ధరలు తదితర ప్రయోజనాలను కొనుగోలుదారులకు అందిస్తుంటాయి.

సంస్కృతంలో ‘అక్షయ’ అంటే ‘శాశ్వతమైనది’ లేదా ‘క్షయం లేనిది’ అని అర్థం. ‘తృతీయ’ అంటే మూడవ తిథి. ఈ రోజున ప్రారంభించిన ఏ పని అయినా, చేసిన పెట్టుబడి అయినా అనంతమైన శ్రేయస్సు, అదృష్టాన్ని తెచ్చిపెడతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ రోజు బంగారం కొనడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. బంగారాన్ని సంపదకు, భద్రతకు చిహ్నంగా భావించి కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజున బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే, కుటుంబానికి సంపద, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం.

శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడిని కలిసింది కూడా అక్షయ తృతీయ నాడేనని అంటారు. పవిత్ర గంగా నది స్వర్గం నుంచి భూమిపైకి దిగివచ్చింది కూడా ఇదే రోజని మరో విశ్వాసం ఉంది. అంతేకాకుండా, దానధర్మాలు చేయడం అక్షయ తృతీయ ఆచారంలో ముఖ్యమైన భాగం. పేదలకు ధాన్యం, వస్త్రాలు, ఇతర నిత్యావసర వస్తువులను దానం చేయడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

AP New Spouse Pension Scheme : https://youtu.be/eqMJzh5moE0

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/