ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఉయదం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు రిలీజ్ చేస్తామన్నారు.
ఫలితాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.inతో పాటు మన మిత్ర నంబర్ 9552300009కు హాయ్ అని సందేశం పంపి తెలుసుకోవచ్చని మంత్రి అన్నారు. కాగా, ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. వీరంతా ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తి చేశారు. ఆ తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేసేందుకు 5-6 రోజుల సమయం పట్టింది. ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అందరికి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మంత్రి నారా లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పారు.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/