ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP Intermediate exam Results) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. విద్యార్థులు resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సాప్ (Manamitra WhatsApp) నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు చూడొచ్చని సూచించారు. ఫోన్‌లో రెండు నిముషాల్లో ఫలితాలు చూసుకోవచ్చన్నారు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం:
Step 1: resultsbie.ap.gov.in వెబ్ సైట్ లో సెర్చ్ చేయండి.
Step 2: హోమ్‌పేజీలో, “AP Inter Results 2025″ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: మీ రోల్ నంబర్, డేట్ అఫ్ బర్త్ వివరాలను నమోదు చేయండి.
Step 4: “Submit” పై క్లిక్ చెయ్యండి. మీ BIEAP ఇంటర్ ఫలితం 2025 మార్క్స్ మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Step 5: భవిష్యత్తు సూచన కోసం మీ మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయండి.
వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి.
సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
ఇంటర్ ఫస్టియర్ / సెకండియర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.