Betting App Case

బెట్టింగ్ యాప్స్ కేసు.. లిస్టులో స్టార్ హీరోలు!

బెట్టింగ్ యాప్స్ కేసులో మరింత మంది సెలబ్రెటీలు బుక్కయ్యారు. తాజాగా మియాపూర్ పోలీసులు మరో 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. ఈ లిస్ట్‌లో రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ల, ప్రణీత వంటి స్టార్లు ఉన్నారు.

ఇక ఇటీవలే పంజాగుట్ట పోలీసులు 11 మంది బుల్లితెర సెలబ్రెటీలు, యూట్యూబర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, ఇమ్రాన్‌ ఖాన్‌, కిరణ్‌ గౌడ్‌, హర్ష సాయి, రీతూ చౌదరి, టేస్టీ తేజ, సుప్రీత, సుధీర్‌, అజయ్‌, సన్నీ యాదవ్‌, సందీప్‌ పేర్లు ఉన్నాయి. వీరిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act- 2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇందులో టేస్టీ తేజ, యాంకర్ విష్ణుప్రియ సహా పలువురు విచారణకి కూడా హాజరయినట్టు సమాచారం. అయితే కొంత మంది ఈ విషయం వెలుగులోకి రాగానే దుబాయ్ కి వెళ్లిపోయారని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గత కొన్నిరోజులుగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు కూడా లిస్ట్ లో ఉండడంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. రోజులో పేరు లిస్ట్ లో యాడ్ అవ్వడం, కొందరు విచారణకు హాజరవ్వడంతో ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో అని చర్చించుకుంటున్నారు.

ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కేసు నమోదైన 11 మంది నిందితులను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియను విచారించారు. మూడు గంటలపాటు సుదీర్ఘంగా విచారణ చేసిన పోలీసులు.. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని ఆదేశించారు.

For more cinema related news : https://theshakthi.com/category/categories/cinema/