బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణం తెలియరాలేదు. శుక్రవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది.
1957లో ఫ్యాషన్ అనే సినిమాతో నటుడిగా బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు మనోజ్ కుమార్. 1961లో కంచ్ కి గుడియా అనే సినిమాతో సక్సెస్ వచ్చింది. 65లో వచ్చిన గుమ్ నామ్ థ్రిల్లర్ మూవీ బ్లాక్ బస్టర్‌గా, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పురబ్ ఔర్ పశ్చిమ్ అనే దేశ భక్తి చిత్రంతో ఇండియా వైడ్‌గా అభిమానుల్ని సంపాదించుకున్నారు.
షోర్ సినిమాలో నటిస్తూ దర్శకత్వం కూడా వహించారు. రోటీ కపడా ఔర్ మఖాన్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు. 92లో పద్మ శ్రీ, 99లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అఛ్చీవ్మెంట్ అవార్డు, 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు వచ్చాయి.
భారత ప్రధాని మోదీ స్పందిస్తూ.. మనోజ్ కుమార్ గారి మరణం ఎంతో కలిచి వేసింది.. ఆయన దేశం గురించి ఎంతో ఆలోచించే వారు.. దేశ భక్తి చిత్రాలను ఎక్కువగా తీశారు.. ఆయనకు దేశం పట్ల ఉన్న భక్తి అనిర్వచనీయమైనది.. ఆయన మరణం తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ వేశారు. 2004 సాధారణ ఎన్నికల టైంలో ఆయన అధికారికంగా బీజేపీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/