dc vs lsg

DC vs LSG : విశాఖలో ఢిల్లీ ధమాకా

విశాఖలో లక్నో చేతులెత్తేసింది. ఐపీఎల్2025లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఢిల్లీ షాకిచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యంతో దిగిన ఢిల్లీ 3 బంతులు మిగులుండగానే ఛేదించింది. అశుతోష్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఢిల్లీని గెలిపించాడు.

210 పరుగుల లక్ష్యంతో దిగిన ఢిల్లీకి మొదటి ఓవర్ లోనే షాక్ తగిలింది. మొదటి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి కోల్పోయింది. 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ, పవర్ ప్లే ముగిసేసరికి 58-4 తో కష్టాల్లో పడింది. ఆ తరువాతి ఓవర్లోనే డేంజరస్ బ్యాట్స్ మెన్ డుప్లెసిస్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో ఇక ఢిల్లీకి ఓటమి తప్పదనుకున్నారు. కానీ విప్రాజ్, అశుతోష్ శర్మ విధ్వంసమే సృష్టించారు. అద్భుతంగా పోరాడి ఢిల్లీకి సూపర్ విక్టరీ అందించారు. ఫోర్లు, సిక్సర్లతో మ్యాచ్ ని మార్చేశారు. 20 బంతుల్లో 50 పరుగుల పార్టనర్ షిప్ చేసారు. అయితే విప్రాజ్ అవుట్ అవ్వడంతో లక్నో ఊపిరి పీల్చుకుంది. కానీ అశుతోష్ శర్మ అద్భుతమైన షాట్ లతో ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. 31 బంతుల్లో 66 పరుగులు చేసాడు. 5 ఫోర్లు, 5 సిక్సర్లతో రికార్డు సృష్టించాడు. విప్రాజ్ 15 బంతుల్లో 39 పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు నికోలాస్ పూరన్, మిచెల్ మార్ష్ విశాఖలో పరుగుల వర్షం కురిపించారు. నికోలాస్ పూరన్, మిచెల్ మార్ష్ విధ్వంసక బ్యాటింగ్ తో విశాఖ స్టేడియం హోరెత్తిపోయింది. ఇద్దరూ సిక్సులు, ఫోర్లలతో విరుచుకుపడ్డారు. పూరన్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో 75 పరుగులు చేయగా… మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 72 పరుగులు చేశాడు. అయితే ఈ ఇద్దరు పెవిలియన్ చేరడంతో స్కోర్ వేగం తగ్గింది.

ఐపీఎల్2025లో భారీ అంచనాలతో వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. ఆరు బంతులు ఆడి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఠాకూర్ కూడా డకౌట్ అయ్యాడు. అయితే చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ రెండు సిక్సర్లు కొట్టి ఫినిష్ చేసాడు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసాడు.

ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మెన్ పూరన్ రికార్డు సృష్టించాడు. 30 బంతుల్లో 75 పరుగులు చేసిన పూరన్, ఏకంగా 7 సిక్స్‌లు కొట్టాడు. ఈ నేపథ్యంలో టీ-20ల్లో 600 సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. మిచెల్ మార్ష్ కూడా ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ స్టేడియం లో సిక్సర్ల వర్షం కురిపించారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ మ్యాచ్ లో 16 సిక్సర్లు కొట్టారు.

For more sports related news :https://theshakthi.com/category/categories/sports/