ఐపిఎల్ 2025లో వరుస పరాజయాల తర్వాత ముంబైకి రెండో విజయం దక్కింది. ఈ సీజన్ లో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న ఢిల్లీ తొలి ఓటమి చవిచూసింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో సూపర్ సండేలో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించి, ఢిల్లీ వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. చివర్లో 3 రన్ ఔట్లు ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచాయి.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్ లో రోహిత్ శర్మ మరోసారి నిరాశ పరిచాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ యాదవ్ 40, తిలక్ వర్మ 59 పరుగులు చేయగా, నమన్ ధిర్ 38 పరుగులు చేశాడు.
206 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీలో అదిరిపోయే ఆరంభం దొరికింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కరుణ్ నాయర్ ముంబై బౌలర్లపై అటాక్ చేసాడు. వరుస సిక్సర్లతో, ఫోర్లతో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. పవర్ ప్లే లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కరుణ్ మరింత స్పీడ్ పెంచాడు. సెంచరీ చేసి మ్యాచ్ గెలిపిస్తాడని అందరు అనుకున్నారు.
ముంబై కంబ్యాక్ : ఈజీగా గెలుస్తాము అనుకున్న ఢిల్లీకి ముంబై చెక్ పెట్టింది. కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ భాగస్వామ్యం విడిపోయాక ఢిల్లీ తడపడింది. ముంబై ఇంపాక్ట్ సబ్ కర్ణ శర్మ జట్టు గెలుపులో కీక పాత్ర పోషించారు. ఏకంగా మూడు వికెట్లు తీసి మ్యాచ్ ను ముంబై వైపుకి తిప్పాడు. ఆ తరువాత నుంచి డీసీ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది
కొంప ముంచి రన్ ఔట్స్: చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ కీలక సమయంలో రనౌట్లు ఢిల్లీని దారుణంగా దెబ్బతీశాయి. అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మోహిత్ శర్మ (0) రనౌట అయ్యారు. బుమ్రా వేసిన 19 ఓవర్లో ముగ్గురు రన్ అవుట్ అయ్యారు. దీంతో ఢిల్లీ ఈ సీజన్ లో మొదటి ఓటమిని చూసింది.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/