Gachibowli

Gachibowli land dispute : ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా

హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. 400 ఎకరాల భూములపై ప్రభుత్వానికి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కు మధ్య వివాదం నెలకొన్న విషయం విదితమే.

ఈ పిటిషన్‌లపై బుధవారం వాదనలు విన్న హైకోర్టు, ఒక్కరోజు పనులను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై గురువారం మరోసారి విచారణ చేపట్టింది.

ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. అడ్వోకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ కేసుపై రోజురోజుకు టెన్షన్ పెరుగుతుంది.

For more related news:https://theshakthi.com/category/categories/trending-news/