బంగారం ధర తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తుంది. లక్షకి చేరువైంది. గతకొన్నిరోజుల నుంచి పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ఇప్పుడు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98 వేలు దాటింది. ఢిల్లీలో ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగి రూ.98,100 ను తాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రూ.97,700 కు చేరుకుంది. కిలో వెండి రూ. 1,900 పెరిగి రూ.99,400లకు చేరింది.
వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి రూ. 1,900 పెరిగి రూ.99,400లకు చేరింది. మంగళవారం కిలో వెండి రూ. 97,500 వద్ద ముగిసింది. బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి రూ. 1.25 లక్షలకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.