Gold rates

Gold Rates : బంగారం ధరలు అస్సలు తగ్గేదేలే!

బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తున్నాయి. రెండు, మూడు రోజులు తగ్గినా మళ్ళీ వెంటనే పెరుగుతున్నాయి. తాజాగా 1500 తగ్గిందని అనుకునేలోపే మరోసారి షాకిచ్చింది. బంగారంతో పాటు వెండి కూడా ధర తగ్గడం లేదు. వెండి ధర 5000 వరకు పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది.

ఇక, ఏప్రిల్ 10వ తేదీ దేశీయంగా 10 గ్రాముల పుత్తడి ధరపై రూ. 3 వేల వరకు పెరిగినట్టు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,940 పెరిగి రూ. 93,380కి చేరుకున్నట్టు సమాచారం.

ముంబైలో రూ. 2,940 పెరిగి రూ. 93,380కి ఎగబాకింది. ఇక, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380కి చేరుకుంది. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ముంబైలో కిలో వెండి ధర ఏకంగా రూ. 2 వేలు పెరిగి రూ. 95 వేలకు చేరుకుంది. హైదరాబాద్‌లో రూ. 5 వేలు పెరిగి రూ. 1.07 లక్షలుగా నమోదైంది.

గమనిక: బంగారం ధరలు వెబ్ సైట్స్ ఆధారంగా రాయబడుతాయి. బంగారం కొనేటప్పుడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి, నేటి బంగారం ధర ఎంత అనేది తెలుసుకున్న తరువాతే బంగారం కొనుగోలు చేయాలనీ విజ్ఞప్తి.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/