బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ తగిలింది. బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తున్నాయి. గత కొన్నిరోజులుగా స్వల్పంగా తగ్గినట్టు కనిపించిన పసిడి, తాజాగా తులం బంగారం ధర రూ.90 వేల మార్క్ దాటింది. ఇక ఉగాది తరువాత పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. దీంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరగనుంది. అయితే, ఈ కొత్త ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలానే పెరుగుతూ పొతే లక్ష మార్క్ ని కూడా టచ్ చేస్తుందేమో అని భయపడుతున్నారు.
ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 91,250గా ఉండగా, తాజాగా రూ. 700 పెరిగినట్టు సమాచారం. బంగారం కొనాలనుకునేవారు మార్కెట్ రేట్స్ ని చెక్ చేసుకొని కొనగలరు. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది.