పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్నిరోజులుగా రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర కొంచెం దిగొచ్చింది. బంగారం ధరలు ఎక్కడ, ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వెబ్ సైట్ ప్రకారం..హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర ఏప్రిల్ 4 ధరతో పోలిస్తే ఏప్రిల్ 5 బంగారం ధర స్వల్పంగా తగ్గినట్టు సమాచారం. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.8,399గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.83,990గా ఉంది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 9,163గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.91,630గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు వరంగల్ లో కూడా కొనసాగుతున్నట్టు సమాచారం.
దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి శుక్రవారంతో పోలిస్తే శనివారం గ్రాముకు రూపాయి తగ్గింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 8,414గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.84,140గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.9,178గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.91,780గా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితుల ఆధారంగా ఉండొచ్చు. బంగారం కొనుగోలు చేసేముందు కచ్చితంగా ధరలు తెలుసుకోండి.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/