sports

GT vs RR : టాప్ లో కూర్చున్న టైటాన్స్

ఐపిఎల్ 2025లో వరుసగా నాలుగో విజయంతో గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్ లో కూర్చుంది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపిఎల్ 2025లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 159 పరుగులకు ఆలౌట్ అయింది.

సుదర్శన్ క్లాస్: సాయి సుదర్శన్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ను ఆర్చర్‌ ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (2)ను స్వల్ప స్కోరుకే అవుట్‌ చేశాడు. కానీ, బట్లర్‌తో కలసి రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేసిన సుదర్శన్‌.. మూడో వికెట్‌కు షారుఖ్‌తో కలసి 62 పరుగులు జోడించడంతో టైటాన్స్‌ భారీ స్కోరు చేసింది. 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 పరుగులు చేసిన సుదర్శన్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వచ్చింది.

ఛేదన ఆరంభంలోనే జైస్వాల్‌ (6), నితీశ్‌ రాణా (1) వికెట్లను చేజార్చుకొన్న రాజస్థాన్‌.. ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేక పోయింది. కెప్టెన్ సంజు శాంసన్ 41 పరుగులు, రియాన్ పరాగ్ 26 పరుగులు చేశారు. చివర్లో షిమ్రన్ హెట్మెయిర్ బ్యాట్‌తో భయపెట్టినప్పటికీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.

32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో హెట్మెయిర్ 52 పరుగులు చేశాడు. జట్టులో 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్‌కు ఇది మూడో పరాజయం. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసుకోగా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ 2 వికెట్లు తీసుకున్నారు.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/