హైదరాబాద్ పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. ఏప్రిల్ 10న వైన్ షాప్స్, బార్లు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల ఆదేశాల ప్రకారం 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అంటే ఆదివారం తెరుచుకోవచ్చు అన్నమాట. వైన్ షాపులు మాత్రమే కాదు, ఆరోజు కల్లు కాంపౌండ్ లను కూడా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి పండుగ రోజు కూడా నగరంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి.
హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తమ ఆదేశాలను బేఖాతురు చేసి షాపులు తెరిస్తే సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/