Sports

Champion Trophy.. టీమిండియాకు రూ.58 కోట్లు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అందుకున్న టీమిండియాకు బీసీసీఐ భారీ రివార్డ్ ప్రకటించింది.. బీసీసీఐ మొత్తం రూ.58 కోట్ల నగదును టీమిండియాకు ప్రకటించింది. ఇది కేవలం ప్లేయర్లకు మాత్రమే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్, కోచింగ్ స్టాఫ్, సెలక్షన్ కమిటీ మెంబర్లు అందరికీ ఈ రూ. 58 కోట్ల నగదులోనే అందనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ అందుకున్న తర్వాత విజేతలకు ఐసీసీ కూడా నగదు బహుమతి అందించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొత్తంగా రూ.60 కోట్ల ప్రైజ్‌మనీని ఐసీసీ కేటాయించింది. విజేతగా నిలిచిన టీమిండియాకు దాదాపు రూ.19.48 కోట్లు వచ్చాయి. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.9.72 కోట్లు అందజేశారు. సెమీ ఫైనల్స్‌లో ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు చెరో రూ.4.86 కోట్లు అందుకున్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు రూ.3.04 కోట్లు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు రూ.1.22 కోట్లు అందజేశారు.

ఇక బీసీసీఐ ప్రకటించిన రూ.58 కోట్ల నగదును కేవలం 15 మంది టీమిండియా ప్లేయర్లే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్, కోచింగ్ స్టాఫ్ అందరికీ ఇవ్వనున్నారు. అజిత్ అగార్కర్‌తో పాటు గౌతమ్ గంభీర్‌కి కూడా ఈ నగదు రివార్డు అందించనున్నారు.

2025 ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు ఒక్క ఓటమి కూడా లేకుండానే కప్ కొట్టింది. సెమిస్ లో ఆస్ట్రేలియాతో, ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో గెలిచి ఛాంపియన్ ట్రోఫీ అందుకుంది. ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ తో టీం ఇండియా మరో కప్ అందుకుంది. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్ లో జరిగాయి. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్స్ లో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, అక్సర్ పటేల్, కేఎల్ రాహుల్ రాణించడంతో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కివీస్ 251 పరుగులు చేయగా, భారత్ 49 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

For more sports related news :https://theshakthi.com/category/categories/sports/