IPL 18 – సెంచరీ హీరోలు గుర్తున్నారా?

IPL 18 – సెంచరీ హీరోలు గుర్తున్నారా?

క్రికెట్ ఫ్యాన్ కు సమ్మర్ పండగే. ఐపీఎల్ 18వ సీజ‌న్ మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ మరింత ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. ప్రతి బ్యాట్స్ మెన్, ప్రతి బౌలర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ప్రతి బాల్ కి మ్యాచ్ మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇక ఈ 20 ఓవర్ల ఫార్మాట్ లో సెంచరీలు మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్స్ లో ఎన్ని సెంచరీలు నమోదయ్యాయో ఇప్పుడు ఒకసారి లుక్ వేసేద్దాం.

ఈ జాబితాలో కింగ్ విరాట్ కోహ్లీ 8 సెంచ‌రీల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. టోర్నీ ఆరంభ ఎడిష‌న్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కే ఆడుతున్న ఈ ర‌న్‌మెషీన్ ఆ జ‌ట్టు త‌ర‌ఫున మొత్తం 8,004 ర‌న్స్ చేశాడు. RCB ఒక్కసారి కప్ కొట్టకపోయినా ఐపీఎల్ లో ప్రతి ఏడాది RCB ఫేవరెట్ గా వస్తుంది.

విరాట్ త‌ర్వాతి స్థానంలో ఇంగ్లండ్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 7 శ‌త‌కాలు బాదాడు. ఈ సీజన్ లో బట్లర్ గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌ఫున ఆడనున్నాడు. ఒక్క ఓవర్ లో మ్యాచ్ ను మార్చేయగల ప్లేయర్స్ లో బట్లర్ ఒకడు.

బట్ల‌ర్ త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు బాదింది క్రిస్ గేల్. ఐపీఎల్ లో క్రిస్ గేల్ 6 శ‌త‌కాలు న‌మోదు చేశాడు. ప్రస్తుతం గేల్ ఐపీఎల్ లో ఆడడం లేదు.

ఇక ఈ ఐపీఎల్ 18వ సీజ‌న్ లో ఎన్ని సెంచరీలు నమోదవుతాయో చూడాలి. ఈ సీజన్ లో ఎవరు మొదటి సెంచరీ చేస్తారు అనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేసేయండి.