ఐపిఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తీరు మారలేదు. సొంతగడ్డపై మరో ఓటమిని చూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై పూర్తిగా చేతులెత్తేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.1 ఓవర్లలో (59 బంతులు మిగిలి ఉండగా) రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మొదటి నాలుగు ఓవర్లకే వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఆ తరువాతి ఓవర్లోనే వేగంగా ఆడుతున్న డీకాక్ (23) బౌల్డ్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ నరైన్ చెన్నై బౌలర్లపై అటాక్ చేసాడు. ఎదుర్కున్న మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు.
పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ స్కోర్ 71-1. ఆ తరువాతి ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్ లో నరైన్ రెండు సిక్సర్లు కొట్టాడు. కానీ వేగంగా ఆడే ప్రయత్నంలో నరైన్ బౌల్డ్ అయ్యాడు. 18 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 44 పరులు చేసాడు. ఆ తరువాత కెప్టెన్ రహానే, రింకు కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు.
అంతకముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుంది. మూడో ఓవర్లో డాన్ కాన్వే పెవిలియన్ చేరడంతో వికెట్ల పతనం మొదలైంది. చెన్నై బ్యాటర్లను కేకేఆర్ స్పిన్నర్లు బోల్తా కొట్టించారు. శివమ్ దూబే (31), రాహుల్ త్రిపాఠి (16), విజయ్ శంకర్ (29) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రచిన్, అశ్విన్, జడేజా, హుడా, ధోనీ, నూర్ అహ్మద్, కాంబోజ్ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
చెన్నై బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు. మొయిన్ అలీ, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీశారు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఆరు వికెట్లు స్పిన్నర్లకు దక్కడం ఇదే తొలిసారి.
చెన్నై చెత్త రికార్డు: ఐపిఎల్ చరిత్రలోనే చెన్నై వరుసగా 5 మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సొంతగడ్డపై వరుసగా 3 మ్యాచుల్లో ఓడిపోవడం కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు ఇదే మొదటిసారి. ఈ లెక్కలేని చూస్తేనే, ఈ సీజన్ లో చెన్నై ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అర్థం అవుతుంది.
Amaravathi Funds Release : https://youtu.be/DZuVR_MWDu0
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/