ipl

అప్పుడు కేఎల్ రాహుల్, ఇప్పుడు పంత్!

ఐపిఎల్ 2025లో లక్నో సూపర్ జియాంట్స్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే లక్నో ఓనర్ ఫుల్ సీరియస్ అయ్యారు. చేతుల్లో ఉన్న మ్యాచ్ ని పోగొట్టిన పంత్ పై సీరియస్ లుక్ ఇచ్చాడు. లక్నో సూపర్ జియాంట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఇలా చేయడం ఇది మొదటిసారి ఏమి కాదు. గతంలో కూడా ఇలానే చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. గతేడాది టీమ్ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద ఆయన ఫైర్ అయ్యారు అయ్యారు. అందరు చూస్తుండగానే రాహుల్‌ను చీవాట్లు పెట్టారు. అప్పుడు ఆ ఫొటోస్, వీడియోస్ ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఐపిఎల్ 2025లో మరోసారి అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది. కానీ ఈసారి పంత్ ఆ ప్లేస్ లో ఉన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం.

ఐపీఎల్ 2025లో విశాఖలో జరిగిన మొదటి మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 1 వికెట్ తేడాతో మట్టికరిచింది. ఆఖరి ఓవర్ వరకు ఎల్‌ఎస్‌జీ చేతుల్లోనే మ్యాచ్ ఉంది. కానీ ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్) అద్భుతమైన ఆటతో ఢిల్లీని గెలిపించాడు. దీంతో అప్పటివరకు తమదే విజయమంటూ ధీమాతో ఉన్న ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా ఓటమి బాధ తట్టుకోలేకపోయాడు. వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్‌ను పిలిచి మాట్లాడాడు. అలాగే కోచ్ జస్టిన్ లాంగర్‌తోనూ సీరియస్‌గా ఏదో చెబుతూ కనిపించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

గత ఐపీఎల్‌ లో కేఎల్ రాహుల్ పై ఫుల్ సీరియస్ అయిన సంజీవ్, ఈ ఐపిఎల్ లో మ్యాచ్ ఓడిపోగానే పంత్ ను పిలిచి సీరియస్ అయ్యాడు. దీంతో గతేడాది ఏం జరిగిందో అదే రిపీట్ అవుతోందని.. లక్నోకు మరిన్ని ఓటములు ఎదురైతే రాహుల్‌కు జరిగిందే పంత్ విషయంలోనూ పునరావృతం అవడం ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాచ్ ఓడిపోతే కెప్టెన్ ని పిలిచి ఇలా అందరి ముందు అవమానించడం, సీరియస్ అవ్వడంతో ప్లేయర్స్ ఆటపై ప్రభావం పడుతుందని, ప్లేయర్స్ కి స్వేచ్ఛనివ్వాలని, మ్యాచుల్లో గెలుపోటములు సహజమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రైజింగ్ పూణె సూపర్‌జియాంట్స్ టీమ్‌కు ఓనర్‌గా ఉన్నప్పుడు ఇలాగే ధోనీని తప్పించి స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్ చేశాడని గుర్తుచేస్తున్నారు.

రిషబ్ పంత్ కు లక్నో సూపర్ జెయింట్స్ ఆక్షన్ లో 27 కోట్లు పెట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో పంత్ రికార్డు సృష్టించాడు. అయితే మొదటి మ్యాచ్ లో ఆరు బంతులు ఆడిన రిషభ్‌ ఒక్క పరుగు చేయకుండానే ఔట్ అయ్యాడు. అంతేకాదు చివరి ఓవర్లో క్యాచ్ ను మిస్ చేసి మ్యాచ్ చేసాడు. దీంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ గెలిచింది.

పింఛన్లు తీసుకునే వారికి శుభవార్త: https://youtu.be/oV6Gt0LgfmM

For more sports related news : https://theshakthi.com/category/categories/sports/