IPL 2025లో సొంత గడ్డపై ముంబై బోణి చేసింది. వరుస పరాజయాలతో సతమమతమవుతున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో మొదటి విజయాన్ని అందుకుంది. వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఓవర్ నుంచే ముంబై బౌలర్లు కోల్‌కతాను కోలుకోకుండా చేసారు. తొలి మ్యాచ్ ఆడుతున్న ముంబై బౌలర్ అశ్వని కుమార్ 4 వికెట్లు తీసి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్‌కతా కీలక సమయంలో చేతులెత్తేశారు. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ పేసర్ అశ్వని కుమార్ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే (11) వికెట్ తో పాటు రింకూ సింగ్ (17), మనీశ్ పాండే (19), ఆండ్రీ రసెల్ (5) వంటి హార్డ్ హిట్టర్లను కూడా అశ్వని కుమార్ బోల్తా కొట్టించాడు.
స్వల్ప లక్ష్యంతో దిగిన ముంబై మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ మొదలు పెట్టింది. రోహిత్ శర్మ (13) త్వరగానే ఔటైనా, మరో ఓపెనర్ రికెల్టన్ (62) అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగి ముంబై విజయాన్ని సునాయాసంగా మార్చేశాడు. విల్ జాక్స్ అవుట్ అయ్యాక వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టి ముంబైకి విజయాన్ని అందించాడు. కోల్‌కతా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని ముంబై 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది తొలి విజయం కాగా, కోల్‌కతాకు ఈ సీజన్‌లో రెండో ఓటమి.
For more sports related post .Click : https://theshakthi.com/category/categories/sports/