Sports

IPL 2025, PBKS vs CSK: శతక్కొట్టిన ప్రియాంశ్ ఆర్య

చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య సెంచరీతో అదరకొట్టాడు. మొదటి బంతికే సిక్స్ కొట్టి ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియాంశ్ 7 ఫోర్లు 9 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు ప్రియాంశ్ మాత్రం చెన్నై బౌలర్లను అటాక్ చేసాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసిన ప్రియాంశ్ ఆర్య, ఐపీఎల్ చరిత్రలో నాలుగో వేగవంతమైన సెంచరీ చేశాడు. అంతకు ముందు 19 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు.

టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (9), స్టోయినిస్ (4), నేహల్ వధేరా (9), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

అయితే ఓపెనర్ గా వచ్చిన ప్రియాంశ్ సింగిల్ హ్యాండ్‌తో పంజాబ్‌కు భారీ స్కోరు అందించాడు. చివర్లో శశాంక్ సింగ్ (52) అర్ధశతకం సాధించాడు. యన్‌సెన్ (34) కీలకమైన పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో చెన్నై బౌలర్లలో అశ్విన్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారు. ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/