gill

SRH vs GT : సొంత గడ్డపై కూడా చేతులెత్తేశారు!

గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేశారు. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములని చూసిన సన్‌రైజర్స్, సొంత మైదానంలో కూడా ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో నిలిచింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. 153 లక్షాన్ని గుజరాత్ టైటాన్స్ మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఛేదనలో మొదటి నాలుగు ఓవర్లు గుజరాత్ బ్యాట్స్ మెన్ ను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేసారు. డేంజరస్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్, బట్లర్ వికెట్లు తీసి గుజరాత్ ను ఇబ్బంది పెట్టారు. అయితే పవర్ ప్లే చివరి ఓవర్లో వాషింగ్టన్ సుందర్ 20 పరుగులు రాబట్టాడు.

ఇక పవర్ ప్లే తరువాత సుందర్, గిల్ అద్భుతంగా ఆడి 50 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో సుందర్ అవుట్ అయ్యాడు. 90 పరుగుల భాగస్వామ్యాన్ని షమీ బ్రేక్ చేసాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.

ఆ తరువాత వచ్చిన రూథర్ ఫోర్డ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో మ్యాచ్ ను త్వరగా ముగించాడు. అభిషేక్ వేసిన ఓవర్లలో వరుస నాలుగు ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్ లో 61 పరుగులు చేసిన గిల్ చివరి వరకు నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సింగల్ తీసి గుజరాత్ కి విజయాన్ని అందించాడు.

For More Related News : https://theshakthi.com/category/categories/sports/