ipl

ఐపిఎల్ 2025 : మజా మొదలైంది..ఎవ్వరూ తగ్గేదేలే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) ధనాధన్ మెరుపులతో ఆరంభమైంది. ఇప్పటికి నాలుగు మ్యాచులు పూర్తికాగా నువ్వా నేనా అన్నట్టు చివరి వరకు పోరాడారు. ఈ ఐపిఎల్ లో మొదటి మ్యాచ్ గెలిచి ఆర్సిబి జోష్ మీద ఉండగా, గత సీజన్ విన్నర్స్ మొదటి మ్యాచ్ లో బోల్తా కొట్టారు. ఇక రెండో మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఇదే మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన ఓడింది రాజస్థాన్ రాయల్స్. ఇక ఎప్పటి నుంచో ఐపిఎల్ లో మొదటి మ్యాచ్ ఓడిపోతున్న ముంబై, ఈసారి ఐపిఎల్ లో కూడా మొదటి మ్యాచ్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ఇక విశాఖలో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు టెన్షన్ పెట్టింది. లక్నోతో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ అద్భుతమైన విజయం సాధించి ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

KKR vs RCB : ఐపిఎల్ 2025లో మొదటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగగా, ముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఇక ఛేదనలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ పై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 175 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించేసింది.

SRH vs RR : సూపర్ సండే లో మొదటి మ్యాచ్ ఆడిన సన్ రైజర్స్ హైదరాబాాద్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగింది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 286 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఛేదనలో రాయల్స్ కూడా అస్సలు తగ్గలేదు. మ్యాచ్ ఓడిపోయిన చివరి వరకు పోరాడింది. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. సంజు శాంసన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నంత సేపు రాజస్థాన్ మ్యాచ్ లో ఉంది. వీరిద్దరూ 4వ వికెట్ కు ఏకంగా 111 పరుగులు జోడించి సన్ రైజర్స్ ను భయపెట్టారు. శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 66 పరుగులు చేయగా… జురెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 70 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరూ అవుట్ అవ్వడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది.

CSK vs MI : ఐపిఎల్ లో ఈ రెండు జట్లు ఎప్పుడు తడబడిన ఎల్ క్లాసికో అనే పేరుంది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసింది. భారీ అంచనాలతో వచ్చిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. 156 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి చెన్నై ఛేదించి విజయాన్ని అందుకుంది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి చెన్నైని గెలిపించాడు. ముంబై తరఫున విగ్నేశ్ పుత్తూర్ 3 వికెట్లతో మెరిశాడు.

DC vs LSG : విశాఖలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ జరిగింది. చివరి వరకు టెన్షన్ పెట్టిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఐపిఎల్ అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుతిరిగాడు. ఛేదనలో ఢిల్లీ లక్నోకి షాక్ ఇచ్చింది. పవర్ ప్లే లోనే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఒక్క వికెట్ తేడాతో లక్నోపై రికార్డు విజయం సాధించింది. అశుతోశ్ శర్మ ఢిల్లీ విజయంలో ఇంపాక్ట్ చూపించాడు.

ఏపీలో ఉచిత కరెంట్ : https://youtu.be/5CenKNsAN6M

For more sports related news :https://theshakthi.com/category/categories/sports/