Ivana

Ivana : ఇవానాకు క్రేజీ ఆఫర్స్

ఇవానా.. అసలు పేరు అలీనా షాజీ, ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2000 ఫిబ్రవరి 25న కేరళలోని చంగనాచెరిలో ముస్లిం కుటుంబంలో జన్మించింది. తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీ నుంచి బి.కామ్ పట్టా పొందింది. ప్రధానంగా మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ.

బాల నటిగా మలయాళ చిత్రాల్లో ఈ అమ్మడి కెరీర్ మొదలైంది. 2012లో “మాస్టర్స్”లో సహాయ పాత్రతో మొదలుపెట్టింది. ఆ తర్వాత “రాణి పద్మిని, “అనురాగ కరిక్కిన్ వెళ్ళంలో నటించింది.

దర్శకుడు బాలా ఆమె నటనను గుర్తించి, 2018లో తమిళ చిత్రం “నాచియార్”లో జ్యోతిక, జి.వి. ప్రకాష్ కుమార్‌లతో కలిసి కీలక పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం తెలుగులో “ఝాన్సీ”గా డబ్ అయింది. తమిళ ప్రేక్షకులకు సులభంగా పలికేందుకు తన పేరును ఇవానాగా మార్చుకుంది.

2022లో “లవ్ టుడే”లో నిఖిత పాత్రతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమె కెరీర్ నే మార్చేసింది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాతోనే ఇవానా కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది. సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.

రీసెంట్ గా విడుదలైన డ్రాగన్ సినిమాలో క్లైమాక్స్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే హీరోతో ఇంతకముందు లవ్ టుడే సినిమాలో నటించింది ఇవానా. దీంతో డ్రాగన్ క్లైమాక్స్ లో ఇవానా ఎంట్రీతో థియేటర్ దద్దరిల్లింది.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/