14236 అంగన్‌వాడీ ఉద్యోగాలు

14236 అంగన్‌వాడీ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల ఖాళీల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 14,236 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 6399 అంగ‌న్వాడీ టీచ‌ర్లు కాగా.. 7837 అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులు ఉండనున్నాయి. గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు కనీసం 10 తరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం.. టీచర్‌తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్‌ పాసైన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్‌ అర్హతను తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది.