కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి నెలకొన్న వివాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేజీఎఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యలు చేసారు.
కేజీఎఫ్ భూములు 400 ఎకరాలను గ్రీన్ జోన్ గా ప్రకటించి, ఎకో పార్క్ గా తీర్చిదిద్ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ)కి కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
కేజీఎఫ్ భూములు హైదరాబాద్ ప్రజలకు చెందినవని, ఈ భూములను అమ్మే ఆలోచనను మానుకోవాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే దాకా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు యూనివర్సిటీ విద్యార్థులు, మరోవైపు పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్షాలు కేజీఎఫ్ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
For more related News:https://theshakthi.com/category/categories/trending-news/