High court

Kasireddy shock AP High Court : కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో వైసీపీ హయాంలో భారీ లిక్కర్ స్కాం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సాక్షిగా తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సీఐడీ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది.

ఈ క్రమంలో సీఐడీ నోటీసులను ఏపీ హైకోర్టులో కసిరెడ్డి సవాల్ చేశారు. సీఐడీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. సీఐడీ నోటీసులపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కసిరెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది.

మరోవైపు మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/