ఐపీఎల్ లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్ లో లక్నోపై రెండో విజయాన్ని అందుకుంది. వీరికి మధ్య ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో జరగగా అశుతోష్ శర్మ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించాడు.
ఇక ఈ సీజన్ లో రెండో సారి ఈ జట్లు తలపడగా, ఢిల్లీ మరోసారి లక్నోని ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 160 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. కేఎల్ రాహుల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ అక్సర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
లక్నోతో మ్యాచ్‌లో అజేయంగా హాఫ్ సెంచరీ (57) చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (135 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (157 ఇన్నింగ్స్), ఏబీ డివిలియర్స్ (161 ఇన్నింగ్స్), శిఖర్ ధావన్ (168 ఇన్నింగ్స్) ఉన్నారు.
ఇక, రాహుల్ 46.35 సగటు, 135.70 స్ట్రైక్‌రేట్‌తో 5వేల రన్స్ పూర్తి చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/