పూరన్ విజృంభించడంతో సొంత గడ్డపై పంత్ సేన ఘన విజయం సాధించింది. లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట గుజరాత్ ను 180 పరుగులకే కట్టడి చేసిన లక్నో, లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఛేదనలో లక్నో బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపై అటాక్ చేసారు. మార్ష్ లేకపోవడంతో ఈ మ్యాచ్ లో మార్క్‌రమ్ తో పాటు పంత్ ఓపెనర్ గా వచ్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసాక ప్రసిద్ కృష్ణ పంత్ ను అవుట్ చేసి గుజరాత్ కు బ్రేక్ ఇచ్చాడు.
అయితే ఆ తరువాత వచ్చిన పూరన్ మాత్రం మరోసారి విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ మార్క్‌రమ్ తో కలిసి గుజరాత్ బౌలర్లపై అటాక్ చేసాడు. మార్క్‌రమ్ 26 బంతుల్లోనే 50 పరుగులు చేసాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో మార్క్‌రమ్ 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 61 పరుగులు చేసిన పూరన్ ను రషీద్ అవుట్ చేసాడు.
ఆ తరువాత ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్ జాగ్రత్తగా ఆడారు. కానీ చివర్లో గుజరాత్ బౌలర్లు లక్నోను టెన్షన్ పెట్టారు. ఇబ్బంది పడుతున్న డేవిడ్ మిల్లర్ ను అవుట్ చేసారు. దీంతో మ్యాచ్ చివరి ఓవర్ కు వెళ్ళింది. అయితే బడోని ఫోర్, సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు.
పూరన్ విధ్వంసం: ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో పూరన్ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. సిక్సర్లతో మాత్రమే డీల్ చేసాడు. 23 బంతుల్లో 6 సిక్సర్లు, ఒక్క ఫోర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. అయితే 61 పరుగులు చేసిన పూరన్ ను రషీద్ అవుట్ చేసాడు. కానీ అప్పటికే పూరన్ చేయాల్సిన పని చేసేసాడు.
అంతకముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ తొలి వికెట్ కు 12.1 ఓవర్లలో 120 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. గిల్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 60 పరుగులు చేయగా… సాయి సుదర్శన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 56 పరుగులు చేశాడు.
అయితే వీరిద్దరూ రెండు పరుగుల తేడాతో అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. జోస్ బట్లర్ (14), వాషింగ్టన్ సుందర్ (2) స్థాయికి తగ్గట్టు ఆడడంలో విఫలం కావడంతో స్కోరు బోర్డు నిదానించింది. షెర్ఫానే రూథర్ ఫోర్డ్ 22, షారుఖ్ ఖాన్ 11 పరుగులు చేశారు. రాహుల్ తెవాటియా (0) డకౌట్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం : https://youtu.be/rjZMPFViJpg
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/