డీఎస్సీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. మార్చ్ 25న మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల (ఏప్రిల్) మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,371 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. వీటిలో 6,371 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 7,725 స్కూల్ అసిస్టెంట్లు, 1,781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 286 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, 52 ప్రిన్సిపాళ్ల పోస్టులు, 132 వ్యాయామ టీచర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల ఏపీ డీఎస్సీ సిలబస్ విడుదల చేసింది.
చంద్రబాబు మాట్లాడుతూ 9 నెలల్లో అనేక హామీలు అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా రూ.4 వేలు పింఛన్ లేదు.. మనం ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలకు పెంచామని చెప్పుకొచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని అన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌తో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్నారు. మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పింఛన్లు తీసుకునే వారికి శుభవార్త: https://youtu.be/oV6Gt0LgfmM
For more AP related news :https://theshakthi.com/category/categories/news-ap/