తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్‌పై 246 పరుగులను ఛేదించి అహో.. అనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ వాంఖడేలో మాత్రం చెమటోడ్చింది. అటు బ్యాట్‌తోనూ ప్రభావం చూపలేక ఇటు బంతితోనూ రాణించలేక తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేశారు. అభిషేక్ (28 బంతుల్లో 7 ఫోర్లతో 40), క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) రాణించగా, చివర్లో అనికేత్ (8 బంతుల్లో 2 సిక్సర్లతో 18 నాటౌట్) వేగంగా ఆడాడు. ముంబై బౌలర్లు అద్భుతమైన బంతులతో హైదరాబాద్ ను కట్టడి చేసారు.
అనంతరం, 163 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ రోహిత్ మూడు సిక్సర్లతో జోష్‌లో కనిపించినా.. నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రికెల్టన్ ను హర్షల్ అవుట్ చేసాడు. ఆ తరువాత జాక్స్-సూర్యకుమార్ జోడీ రైజర్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ఒత్తిడి తగ్గించారు. అలాగే 11వ ఓవర్‌లో చెరో సిక్సర్‌తో జట్టు స్కోరు వంద దాటింది.
కమిన్స్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చాడు. కానీ హార్దిక్ (9 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21)-తిలక్ (17 బంతుల్లో 2 ఫోర్లతో 21 నాటౌట్)ల ఎదురుదాడితో రైజర్స్ చేసేదేమీ లేకపోయింది. 17వ ఓవర్‌లో హార్దిక్ 6,4తో సమీకరణం 18 బంతుల్లో 2 రన్స్‌కు మారింది.
అయితే మలింగ తర్వాతి ఓవర్‌లో ఒకే రన్ ఇచ్చి హార్దిక్, నమన్ (0)ల వికెట్లను తీశాడు. చివరకు 19వ ఓవర్ తొలి బంతిని ఫోర్‌గా మలిచిన తిలక్ ముంబైని సంబరాల్లో ముంచాడు.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/