భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్

భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. మార్చ్ 9న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా నాలుగోసారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో భారత్ అడుగుపెట్టింది. భారత్ టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కూడా సత్తా చాటి ఛాంపియన్స్‌గా నిలవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. న్యూజిలాండ్ కూడా సౌత్ ఆఫ్రికాపై గెలిచి ఎలాగైనా ఈసారి కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఫైనల్స్ లో రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉండనుంది.