Gas Leak

Ammonia Gas Leak: నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్

నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు బయపడి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఊపిరాడక పది మంది కార్మికులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.

అంబులెన్స్ ల సాయంతో వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకూ గ్యాస్ వ్యాపించిందని స్థానికులు తెలిపారు. ప్రజలు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించారు. అయితే అసలు గ్యాస్ ఎలా లీక్ అయ్యింది అనేది ఇంకా తెలియలేదు.

మంచు మనోజ్ కార్ చోరీ : https://youtu.be/rV3EgZPHSAg

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/