ఏపీలో మార్చ్ 17 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.49 లక్షల మంది విద్యార్థులు 3,450 పరీక్ష కేంద్రాలకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. బస్ పాస్ లేకపోయినా, హాల్ టికెట్స్ కచ్చితంగా చూపించాలని తెలిపింది.

Posted inCategories News AP