బాల్ రెడ్డి నగర్ లో పెళ్ళైన నెలరోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. గత నెల ఫిబ్రవరి 6న ఈశ్వర రావుతో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న గంట విజయ గౌరీ(20) వివాహం జరిగింది. పెళ్లి జరిగి ఇంట్లో అందరు సంతోషంగా ఉన్న సమయంలో ఇంట్లో ఉరేసుకొని గౌరీ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గౌరీ ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఉరేసుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted inCategories News Telangana